గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

రిపోర్టర్: విజయ్ స్థలం: బీబీనగర్

గిరిజన ప్రాంతాల్ లో నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ర్ట మంత్రి సీతక్క వెల్లడించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గిరిజనులు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదన్నారు. మారుమూల ప్రాంతాల పేదలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుందని ఆమె స్పష్టం చేశారు.