బ్రహ్మోస్ క్షిపణుల అప్‌గ్రేడ్‌పై భారత్-రష్యా కీలక చర్చలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణుల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా చర్చలు జరుపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి పోటీతత్వాన్ని పెంచేందుకు అదనపు హంగులను జోడించనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. త్వరలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీలో రక్షణ రంగ సహకారంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.