కిసాన్ మేళాలో రైతులతో మమేకమైన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల
రిపోర్టర్: హరి
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లాలో జరిగిన కిసాన్ మేళాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఆధునిక సాంకేతిక పద్ధతులపై ఆయన రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.