ఆహార నాణ్యత లోపాలపై ఫిర్యాదులకు స్విగ్గీ ప్రత్యేక హెల్ప్‌లైన్

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వినియోగదారుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ మరియు యాప్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆహారంలో నాణ్యతా లోపాలు ఉంటే 7948231850 నంబర్‌కు లేదా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫిర్యాదులను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది.