ఢిల్లీ పర్యటనలో చేదు అనుభవాలు: సోషల్ మీడియాలో మలేషియా టూరిస్ట్ పోస్ట్ వైరల్

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత రాజధాని ఢిల్లీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను మలేషియా టూరిస్ట్ అల్విన్ లా వెల్లడించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. విమానాశ్రయం నుంచి మెట్రో స్టేషన్ వరకు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన వివరించారు. ఈ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయని, ఢిల్లీ పర్యటన అందరికీ కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు.