ఈడీ అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు: సుమోటో విచారణ చెల్లదు
రిపోర్టర్: సతీష్
స్థలం: బెంగళూరు
తన దృష్టికి వచ్చిన ప్రతీ అంశాన్ని విచారించే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసినట్లు జస్టిస్ ఎంఐ అరుణ్ వెల్లడించారు. మనీలాండరింగ్ కేసులో చట్టబద్ధ నిబంధనలను దాటవేసే అధికారం లేదని, క్రిమినల్ కేసు నమోదైతేనే దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజగౌడ సహా పలువురు పిటిషనర్లపై ఈడీ చేపట్టిన విచారణలు, ఆస్తుల జప్తు ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.