అమెరికాలో తానా ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌ల పంపిణీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: USA

అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒహాయో వ్యాలీ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లు పంపిణీ చేశారు. అరోరా సిటీ కోఆర్డినేటర్ రామారావు పంగులూరి నాయకత్వంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో స్థానిక విద్యార్థుల విద్యా ప్రయాణానికి సహకరించేలా బ్యాక్‌ప్యాక్‌లను అందజేశారు. తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.