భారత్‌పై విదేశీ కుట్రలను ఖండించిన మేరీ మిల్బెన్‌కు ఎంపీ గోడం నగేశ్ ధన్యవాదాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆదిలాబాద్
భారత దేశంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను, విదేశీ నిధుల కుట్రలను నిర్భయంగా ఎండగట్టిన ప్రముఖ గాయని మేరీ మిల్బెన్‌కు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ శక్తుల సమన్వయంతో సాగుతున్న తప్పుడు సమాచార ప్రచారం మన దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి, అస్థిరపరచడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే ఇటువంటి కుట్రలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.