పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
రిపోర్టర్: సతీష్
స్థలం: Kadapa
కడప జిల్లా పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. 2018 నాటి కేసులకు సంబంధించి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అప్పట్లో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన బాలాజీ, సీనియర్ అసిస్టెంట్ దస్తగిరిపై నమోదైన అభియోగాల నేపథ్యంలోనే ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. అధికారుల వెంట నిందితులు కూడా ఉన్నారని, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లపై విచారణ ముమ్మరం చేసినట్లు వారు స్పష్టం చేశారు.