ఏపీ మంత్రివర్గ అత్యవసర భేటీ: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో శనివారం ఏపీ మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చట్టపరమైన అంశాలను పరిశీలించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.