రైలులో ధూమపానంపై నిలదీసిన యువకుడిపై దాడి: కదులుతున్న రైటులోంచి కిందకు తోసేసిన దుండగులు
రిపోర్టర్: శివ
స్థలం: Ludhiana
రైలులో ధూమపానం చేయవద్దని వారి మందలించినందుకు ఇరవై ఐదు ఏళ్ల తుషార్ ఠాకూర్ అనే యువకుడిపై దుండగులు దారుణానికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. జమ్మూ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సమయంలో కదులుతున్న రైలులో నుంచి తనను కిందకు తోసేశారని, ఈ ఘటనలో తన వెన్నుపూస దెబ్బతిని నడవలేని స్థితిలో చక్రాల కుర్చీకి పరిమితమయ్యానని బాధితుడి తండ్రి వీరేందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. లూథియానా సమీపంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.