కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ ల జాబితా బయటపెట్టిన మన్నె క్రిశాంక్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఫామ్ హౌస్ లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీ తీవ్ర కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతల అక్రమ ఫామ్ హౌస్ ల జాబితాను బయటపెట్టారు. ప్రైవేట్ ఆస్తుల పేరుతో రాజకీయం చేయడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.