గ్యారేజీలో పుట్టాను, అందుకే పెద్ద ఇల్లు కట్టాలనిపించింది: రాకేష్ రోషన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహారాష్ట్ర
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ తన ఖండాలాలోని రూ.120 కోట్ల విలాసవంతమైన బంగ్లాను ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. తాను గ్యారేజీలో పుట్టానని, అందుకే పెద్ద ఇల్లు కట్టాలని ఎప్పుడూ కలలు కనేవాడినని ఆయన ఈ సందర్భంగా భావోద్వేగంగా చెప్పారు. ఈ అద్భుతమైన బంగ్లా చూసి ఫరా ఖాన్ అవాక్కయ్యారు.