'కొత్త పెన్షన్లకు భారీ స్పందన': తెలంగాణలో 5.9 లక్షలకు పైగా దరఖాస్తులు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం కేటాయించిన దరఖాస్తు గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,98,193 దరఖాస్తులు అధికారికంగా నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 46,540, అత్యల్పంగా ములుగులో 4,818 దరఖాస్తులు అందగా, వీటిలో వితంతు పెన్షన్ల కోసమే గరిష్టంగా 3.31 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ వెల్లడించింది.