యువ నటుడు చంద్రహాస్ కోట్ల కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభ
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
యువ నటుడు చంద్రహాస్ కోట్ల హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఫిల్మ్‌నగర్‌లోని శ్రీ సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర ఈ సినిమాను నిర్మిస్తుండగా, చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌తో పాటు పూర్తి వివరాలను చిత్ర బృందం మీడియా ముందుకు తీసుకురానుంది.