కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర విమర్శలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

రామ్ లీలా మైదాన్ లో భారీ జనసమూహం కనిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కృత్రిమ మేధస్సు ఫోటోను వాడిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఆరోపించారు. కనీసం ఆ నకిలీ చిత్రాన్ని కూడా సరిగ్గా తయారు చేయలేకపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆయన విస్మయం వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.