రాష్ట్రస్థాయి అండర్ 14 క్రీడా పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థిని ఆరాధ్య

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆరాధ్య అండర్-14 క్రీడా పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ వివి రమణ ప్రసాద్ తో పాటు అధ్యాపకులు ఘనంగా అభినందించారు.