బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఏపీ మరియు ఒడిశాకు భారీ ముప్పు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇది తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా ఏపీ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉండటంతో, విశాఖపట్నం, కాళీపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.