పోలవరం ఎత్తు తగ్గింపునకు చంద్రబాబు రాజీ పడ్డారన్న జగన్

రిపోర్టర్: హరి స్థలం: Amaravati

పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించడంపై సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంతో సీఎం చంద్రబాబు రాజీ పడటం వల్లే 75 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు.