వైరల్ ఘటన: భర్త కావాలంటూ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించిన యువతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: North Carolina

భర్తను వెతుక్కునేందుకు డేటింగ్ యాప్లకు భిన్నంగా అమెరికాకు చెందిన అరిన్ పాటర్సన్ అనే యువతి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు కాబోయే భర్త కోసం ఆమె ఏకంగా మూడు పేజీల గూగుల్ ఫామ్ను రూపొందించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ విచిత్రమైన దరఖాస్తు ప్రక్రియకు భారీ స్పందన లభించిందని, వందలాదిగా అప్లికేషన్లు అందినట్లు ఆమె తెలిపారు. వివాహంపై స్పష్టమైన లక్ష్యంతో ఉన్నట్లు ఆ యువతి పేర్కొన్నారు.