ఆదిలాబాద్‌లో ఉత్సాహంగా అండర్-15 జిల్లా స్థాయి చదరంగం ఎంపికలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అండర్-15 బాలబాలికల జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 20 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చదరంగం సంఘం అధ్యక్షులు ఆర్.జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శి ఎన్.స్వామి పాల్గొన్నారు.