తెలంగాణలో వాయుగుండం ప్రభావంతో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలంగాణలో వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 24 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.