యునెస్కో తాత్కాలిక జాబితాలో ఐదు కొత్త భారతీయ చారిత్రక ప్రదేశాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

భారతదేశానికి చెందిన ఐదు కొత్త చారిత్రక ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయని పీఐబీ కల్చర్ వెల్లడించింది. మధ్యప్రదేశ్లోని బాగ్ గుహ పెయింటింగ్స్, చంబల్ లోయ దేవాలయాలు, ఉదయగిరి గుహలు, గిన్నోర్గఢ్ కోటతో పాటు మహాత్మా గాంధీ సత్యాగ్రహంతో ముడిపడిన ప్రదేశాలకు ఈ గుర్తింపు లభించింది. దీంతో యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరిన భారతీయ ప్రదేశాల సంఖ్య 78కి చేరిందని అధికారులు తెలిపారు.