శ్రీవిష్ణు సరసన నటించడం చాలా ఆనందంగా ఉందంటూ మహిమా నంబియార్ వెల్లడి
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
శ్రీవిష్ణు సరసన కామ్రేడ్ కళ్యాణ్ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ మహిమా నంబియార్ తెలిపారు. ఈ నెల తొమ్మిదవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె వెల్లడించారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడిన ఆమె, చిత్రంలో తన పాత్ర ఒరిస్సా నుంచి వచ్చిన ఇన్నోసెంట్ అమ్మాయిలా ఉంటుందని చెప్పారు. తొంభైల నేపథ్యంలో నడిచే ఈ కథాంశం ఆద్యంతం నవ్విస్తుందని, నక్సలిజం అంశాన్ని కూడా ఎంతో వినూత్నంగా ఇందులో చూపించామని మహిమ స్పష్టం చేశారు.