సౌదీ సైనిక స్థావరంపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడి
రిపోర్టర్: రమేష్
స్థలం: World
యెమెన్ సరిహద్దు సమీపంలో సౌదీ అరేబియాలోని షరూరా సైనిక స్థావరంపై హౌతీ రెబెల్స్ క్షిపణులు మరియు డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణనష్టం, తీవ్ర ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఎర్రసముద్రం వద్ద ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో, బాబ్ అల్-మండెబ్ జలసంధి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి.