బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సైఫాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ కేసును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేయడంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.