ఫెస్టివ్ సీజన్ ముందు అపాచీ పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసిన టీవీఎస్ మోటార్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ రాబోయే ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తన మొత్తం అపాచీ పోర్ట్‌ఫోలియోకు కీలక అప్‌డేట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా అపాచీ 160, 200, 310 ఆర్టీఆర్ మోడళ్లతో పాటు రోనిన్ బైకులలో అదనపు సేఫ్టీ, కనెక్టివిటీ ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లను సంస్థ పరిచయం చేసింది.