వైద్యుల సూచనలు లేకుండా స్టెరాయిడ్ క్రీములు వాడితే అనర్థాలంటూ ప్రొఫెసర్ వెంకటాచలం హెచ్చరిక

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

వైద్యుల సలహా లేకుండా చర్మ సౌందర్యం కోసం స్టెరాయిడ్ క్రీములు విచ్చలవిడిగా వాడటం వల్ల దీర్ఘకాలంలో తీవ్ర దుష్పరిణామాలు తలెత్తుతాయని ఉత్తరాంధ్ర డెర్మటాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వెంకటాచలం హెచ్చరించారు. మార్కెట్లో లభించే హానికర రసాయనాల క్రీములతో తాత్కాలిక ఉపశమనం లభించినా, చర్మ సంబంధిత వ్యాధులు బారినపడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులు వ్యసనంలా వీటిని వాడొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.