జూరాల ప్రాజెక్ట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా నేపథ్యంలో నేతల ముందస్తు అరెస్టులు

రిపోర్టర్: రాము స్థలం: మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు పిలుపునివ్వడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. అప్పన్నపల్లి సమీపంలోని తిరుమల హిల్స్ నివాసంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని, అలాగే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నాయకుల అణచివేత మధ్యే రైతులు స్వచ్ఛందంగా ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు.