నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా: కోట్లకు పడగలెత్తుతున్న దళారులు

రిపోర్టర్: శివ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని పౌరసరఫరాల అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వరిసాగు తగ్గి బియ్యం ధరలు పెరగడంతో మాఫియా రంగంలోకి దిగిందని, కిలో పది రూపాయలకే కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాత్రి వేళల్ లో లారీల్ లో తరలిస్తూ కోట్లు ఆర్జిస్తున్న ఈ దందాపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.