దళితులు గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోంది

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.