కావలిలో దారుణం: ఎస్సై అత్తను హతమార్చి సవర్ల బంగారం దోపిడీ
రిపోర్టర్: సురేష్
స్థలం: కావలి
కావలి గ్రామీణ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తిరుమలరెడ్డి అత్త పొంగులూరి విజయలక్ష్మిని దుండగులు దారుణంగా హతమార్చి ము సవర్ల బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తుపాన్నగర్ భైరాగులవీధిలో ఒంటరిగా నివసిస్తున్న ఆమె గొంతు నులిమి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. సంఘటనాస్థలికి చేరుకున్న కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ వివరాలు సేకరిస్తుండగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.