కూటమి సర్కార్కు, పోలీసుల తీరుకు జగన్ బహిరంగ హెచ్చరిక

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విశాఖపట్నం

గ్రేటర్ విశాఖపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం పోలీసులపైనే ఆధారపడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. పోలీసులు సింహాలకే తలవంచాలని, ప్రతి ఒక్కరి లెక్కలు డిజిటల్ డైరీ ద్వారా తేలుస్తామని జగన్ హెచ్చరించారు.