స్మార్ట్ భద్రత కోసం కొత్త డిజిటల్ సేఫ్స్ సిరీస్ లాంచ్ చేసిన యేల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

ఆధునిక గృహాల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో సోలిస్ సేఫ్ సిరీస్ పేరుతో సరికొత్త ప్రీమియం డిజిటల్ సేఫ్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు యేల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విలువైన వస్తువులు, ఆభరణాలు మరియు పత్రాల రక్షణ కోసం ఈ అతధునిక లాకింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు వారు పేర్కొన్నారు. వేలిముద్ర గుర్తింపు మరియు పిన్ కోడ్ వంటి అధునాతన సౌకర్యాలతో ఇవి లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.