ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ: యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్
రిపోర్టర్: నరేష్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను, ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. యువతకు అండగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, రాబోయేది తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.