మద్యం రవాణా కుంభకోణం: సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించిన నిందితులు

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్కుమార్రెడ్డిని సిట్ అధికారులు విచారించినట్లు సమాచారం. ఈ కుంభకోణానికి సంబంధించి అంతా రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్యలకే తెలుసని విచారణలో ఈశ్వర్ వెల్లడించినట్లు తెలిసింది. మరోవైపు, వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావును కూడా సిట్ అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. అయితే ఈ ఇద్దరూ విచారణకు సహకరించలేదని సమాచారం.