ఢిల్లీ వారణాసి మార్గంలో రెండో వందేభారత్ స్లీపర్ రైలు

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

భారతీయ రైల్వే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ వారణాసి మార్గంలో రెండవ వందేభారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. కాన్పూర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా సాగే ఈ రైలు సుమారు 16 కోచ్‌లు మరియు 823 మంది ప్రయాణికుల సామర్థ్యంతో రాత్రిపూట ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. కవచ్ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్లు మరియు ఆధునిక వసతులతో ఈ రైలు రాకపోకలు సాగించనుందని రైల్వే శాఖ తెలిపింది.