తెలుగులో ది ట్రైటర్స్ షో హోస్ట్ గా తేజ సజ్జా
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ గేమ్ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్‌కు యువ నటుడు తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని వారు పేర్కొన్నారు. ఇరవై మంది విభిన్న రంగాల ప్రముఖులతో నాలుగు వారాలపాటు పది ఎపిసోడ్స్‌గా ఈ ఉద్వేగభరితమైన గేమ్ షో సాగనున్నట్లు వెల్లడించారు.