పాపులర్ యానిమేటెడ్ సిరీస్: మూడో సీజన్ కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
ప్రముఖ అడల్ట్ యానిమేటెడ్ కామెడీ సిరీస్ 'హంటెడ్ హోటల్' మూడో సీజన్ కు రెన్యువల్ అయినట్లు సృష్టికర్త మాట్ రోలర్ వెల్లడించారు. ప్రపంచంలోని అత్యంత భయానక హోటల్‌ను నడిపే సింగిల్ మదర్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, 2027 నాటికి ఈ సరికొత్త మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన తెలిపారు.