'విశ్వకర్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి': Anakapalli Police
రిపోర్టర్: సునీల్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లాలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శిల్పకళ, వాస్తుశాస్త్ర సృష్టికర్త అయిన విశ్వకర్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా Anakapalli Police స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.