ఈఎన్ఈ రీపీట్ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈఎన్ఈ రీపీట్ సినిమా ట్రైలర్ను నవంబర్ మూడో తేదీన సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ చిత్రం నవంబర్ పంతొమ్మిదో తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుందని మేకర్స్ స్పష్టం చేశారు.