ఉత్తర కొరియా సంచలనం: శక్తివంతమైన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

లక్ష్య ప్రాంతాన్ని పూర్తిగా బూడిద చేసే సత్తా ఉన్న శక్తివంతమైన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. దక్షిణ కొరియాతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదారు హెక్టార్ల పరిధిలోని లక్ష్యాలను పూర్తిగా ధ్వసం చేయగల బహుళ వార్హెడ్ సాంకేతికతను ఈ క్షిపణి కలిగి ఉందని అధికారులు తెలిపారు.