హుకుంపేటలో శరన్నవరాత్రి వేళ సరస్వతీ దేవికి వైభవంగా ప్రత్యేక పూజలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: హుకుంపేట

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని సత్కంపట్టు శ్రీ దుర్గమ్మ ఆలయం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సరస్వతీ దేవిని పురస్కరించుకుని భవానీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.