యువ క్రికెటర్ల పెంపకంపై వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఢిల్లీ
డబ్బు విలువ, కష్టపడి సంపాదించడం ఎంత ముఖ్యమో తన కుమారులకు నేర్పుతున్నానని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. భవిష్యత్తులో విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటూ, సొంత కష్టంతో ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్ ఆడుతూ కుమారులు ఆర్జన చేస్తున్నారని, డబ్బు విలువ తెలుసుకునేలా చిన్ననాటి నుంచే శిక్షణ ఇస్తున్నట్లు సెహ్వాగ్ స్పష్టం చేశారు.