కాంగ్రెస్ కార్యాలయంలో నూతన బోర్ పంపును ప్రారంభించిన పట్టణ అధ్యక్షుడు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ పంపు మోటార్ను ప్రారంభించారు. నూతన బోర్కు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.