భారత టీ20 జట్టులోకి సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు చోటు దక్కిందని బీసీసీఐ వెల్లడించింది. సుదీర్ఘ విరామం తర్వాత అతను మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడని అధికారులు తెలిపారు. వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్ జట్టుతో పోలిస్తే సెలక్టర్లు రెండు మార్పులు చేశారని, రవి బిష్ణోయ్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని కూడా ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు స్పష్టం చేశాయి.