సెనేట్ విచారణలో కాష్ పటేల్, కోరీ బుకర్ మధ్య తీవ్ర వాగ్వాదం
రిపోర్టర్: సతీష్
స్థలం: World
అమెరికా సెనేట్ విచారణలో ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రాట్ సెనేటర్ కోరీ బుకర్ తన గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్ ప్రయాణాల గురించి ప్రశ్నించడంపై పటేల్ మండిపడ్డారు. తన ప్రియమైన వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ఎఫ్బీఐ వనరులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై జరిగిన ఈ సమావేశంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.