హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షాలు: నగరంలో భారీగా నిలిచిన ట్రాఫిక్

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబరు నాల్గవ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నాగోల్, దిల్ సుఖ్ నగర్, అబిడ్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పష్టం చేశారు.