సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా డిమాండ్‌పై కాక్రోచ్ జనతా పార్టీ నిప్పులు
రిపోర్టర్: సురేష్
స్థలం: ముంబై
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ముంబై కేంద్రంగా అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పదవి నుంచి తప్పుకోని పక్షంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని అభిజీత్ హెచ్చరించారు. కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.