తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను ఆదుకుంటామని సీఎం భరోసా

రిపోర్టర్: విజయ్ స్థలం: పశ్చిమ గోదావరి

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నీటమునిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారని, వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో జరిగిన ఈ పర్యటనలో అన్నదాతల సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తక్షణ సహాయక చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.